రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ వల్ల ప్రజలపై అధిక భారం పడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికే... పన్నుల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
''ఎల్‌ఆర్‌ఎస్ వల్ల ప్రజలపై అధిక భారం పడింది. భయంకరంగా పన్నులు వేసి ప్రజలను పీడిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కట్టకపోతే రిజిస్ట్రేషన్లు చేయబోమని ప్రభుత్వం బెదిరిస్తోంది. అసలు రిజిస్ట్రేషన్లు ఆపే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? పేదలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే వాటిని క్రమబద్ధీకరించాలి. తెచ్చిన అప్పులు తీర్చడానికే ప్రజలపై భారం మోపుతున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ శాశ్వతం కాదు... మేము కూడా అధికారంలోకి వస్తాం. ఎవరూ ఎల్‌ఆర్‌ఎస్ కట్టకండి. మేము అధికారంలోకి వచ్చాక అందరికి న్యాయం చేస్తాం.''
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
''ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఫీజు తీసుకున్నది ప్రభుత్వమే కదా... మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు ఎందుకు కట్టాలి. ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ కట్టే భారాన్ని మీద వేసుకోకుండా... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించండి. మీకు తోడుగా మేము ఉన్నాం.''