తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉస్మానియా స్థలాలను మింగేస్తే... చూస్తూ ఊరుకోం'

ఉస్మానియా విశ్వవిద్యాలయ భూముల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. భూముల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై గవర్నర్‌ను కలుస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తెలిపారు. ఎట్టి పరిస్థితిలోనూ ఓయూ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రసక్తే లేదనీ... అందుకోసం పోరాటం చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

congress-leaders-on-osmania-university-lands
'ఉస్మానియా స్థలాలను మింగేస్తే... చూస్తూ ఊరుకోం'

By

Published : May 24, 2020, 5:34 PM IST

Updated : May 24, 2020, 5:43 PM IST

ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. డీడీ కాలనీలో కబ్జాలకు గురవుతున్న ఉస్మానియా యూనివర్సిటీ భూములను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలోని సీనియర్ నేతలు పరిశీలించారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఓయూ భూముల పరిరక్షణ కోసం గవర్నర్‌ను కలుస్తామని ఉత్తమ్‌ అన్నారు.

''తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసేసి... ప్రైవేటు వాటిని ప్రోత్సహించడం చాలా బాధాకరం. ఓయూ స్థాపించేటప్పుడు 1600లు ఎకరాలు ఉండేవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమంగా ఉస్మానియా విస్తీర్ణం తగ్గిపోతుంది.''

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

తప్పుడు పత్రాలతో అనుమతులకు ప్రయత్నాలు..!

వర్సిటీ భూముల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని మేయర్ బొంతు రామ్మోహన్‌కు.. ఓయూ రిజిస్ట్రార్‌, ఉప కులపతి విజ్ఞాపన పత్రం అందజేశారు. తప్పుడు పత్రాలు చూపుతూ విశ్వవిద్యాలయం భూముల్లో 9 మంది నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు కోరుతున్నారని ఆరోపించారు.

తులసి కో-ఆపరేటింగ్ సొసైటీకి, ఉస్మానియా వర్సిటీకి మధ్య ఏర్పడిన స్థల వివాదంలో సుప్రీంకోర్టు 4,800 చదరపు గజాల స్థలాన్ని సొసైటీకి ఇచ్చినట్లు తెలిపారు. అయితే మరో 9 మంది వ్యక్తులు అదే సొసైటీతో కుట్రపూరితంగా తప్పుడు పత్రాలు సృష్టించి ఓయూ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.

'ఉస్మానియా స్థలాలను మింగేస్తే... చూస్తూ ఊరుకోం'

కాంగ్రెస్ నేతల విజ్ఞప్తిపై మేయర్ స్పందించారు. ఈ అంశంపై తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్​ఎంసీ కమిషనర్‌కు మేయర్ సూచించారు.

ఇవీ చూడండి:కొత్తది కొనలేం.. పాతది పాడైతే బాగు చేయించలేం...!

Last Updated : May 24, 2020, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details