Komati reddy: మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో చురుక్కుగానే ఉన్నానని.. ఎలాంటి అసంతృప్తి లేదని వెల్లడించారు. కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జి మానిక్కం ఠాగూర్, ఇతర ముఖ్య నేతలతో తన నివాసంలో భేటీ అయ్యారు.
నేను దేన్నీ పట్టించుకోను. మొదటి నుంచి పార్టీలో కష్టపడుతున్న వారికే టికెట్లు ఇవ్వాలి. రాహుల్, సోనియాతో నేరుగా మాట్లాడి.. సర్వే చేయించి టికెట్లు ఇవ్వాలని కోరుతా. ఎందుకంటే పదేళ్లుగా కేసీఆర్‌ను తట్టుకుని పోరాడుతున్న వారికి ఇవ్వాలనేది నా డిమాండ్. ఇరవై ఏళ్ల కింద ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు పార్టీలో చేరేవారికి టికెట్లు ఇస్తే నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుంది.-కోమటి రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
పీఏసీకి రాలేనని తాను ముందే చెప్పినట్లు కోమటిరెడ్డి అన్నారు. 29 మందితో కమిటీ వేస్తే దానికి వెళ్లి తాను ఏం మాట్లాడతానని ప్రశ్నించారు. పీఏసీ కమిటీ సభ్యుల సంఖ్యను కుదించాలన్నారు. డాక్టర్ రవి చేరిక చెల్లక పోతే బిల్యా నాయక్ చేరిక ఎలా చెల్లుతుందన్నారు. బిల్యా నాయక్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి నష్టం చేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. అహ్మదాబాద్‌ను అదానిబాద్గా మార్చుకోమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు చెప్పానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సింగరేణి కోల్ బ్లాక్‌ను నైని కోల్ మైన్ కంపెనీకి అప్పగించారని ఆయన ఆరోపించారు. తమ పోరాటంతో దాన్ని వెనక్కి తీసుకున్నారన్నారు.