గవర్నర్ని కలిసిన కాంగ్రెస్ నాయకుల బృందం Congress Leaders Meet Governor Tamil sai : వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రాజెక్టులను సాంకేతిక లోపంతో నిర్మించడం వల్లే ఈ ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం రాజ్ భవన్లో గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ను కలిసింది. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీష్, ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ తదితరులు కలిశారు.
Bhatti Vikramarka Comments ON KCR : రాష్ట్రంలో గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్ బృందం గవర్నర్కు వినతిపత్రం ఇచ్చింది. ఇంజినీర్ల సలహాలను, సూచనల్ని పట్టించుకుంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కావని కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ తన రాజకీయాల అవసరాల కోసం ప్రాజెక్టులు కట్టడం వల్లనే ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. వరదల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోయిన ఆదివాసీలను ఆదుకోవాలని గవర్నర్ను కోరారు.
Bhatti Vikramarka Latest News : 'ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్'
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ పార్టీ విజయమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించడంతో కేసీఆర్ దిగివచ్చారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తాము డిమాండ్ చేస్తే… కేసీఆర్ గతంలో ఏం మాట్లాడారో అందరికీ గుర్తుందని వ్యాఖ్యానించారు. పనికిమాలిన పార్టీలు పనిలేని మాటలు మాట్లాడుతున్నాయని కేసీఆర్ అప్పట్లో అన్నారని గుర్తు చేశారు. ఆర్టీసి ఆస్తులన్నీ.. ప్రజల ఆస్తులని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని స్పష్టం చేశారు.
"వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రాజెక్టులను పూర్తిగా సాంకేతిక లోపంతో కట్టడం వల్లే ప్రమాదం ఏర్పడింది. ఇంజినీర్ల సలహాలను పట్టించుకుంటే ఇలాంటి ఇబ్బంది వచ్చేది కాదు. సీఎం కేసీఆర్ తన రాజకీయాల అవసరాల కోసం ప్రాజెక్టులు కట్టడం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాజెక్టులు వరదల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు పూర్తిగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ విలీనం కాంగ్రెస్ పార్టీ విజయానికి సాంకేతం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది..దీనికి కేసీఆర్ దిగివచ్చారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సీఎం భరోసా ఇవ్వాలి."- భట్టి విక్రమార్క , సీఎల్పీ నేత
ఇవీ చదవండి :