తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద కూడా నిరసన చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులను మోహరించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మల్లు రవిని గృహనిర్బంధం చేశారు. మిగతా నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులను మోహరించారు. ప్రజాస్వామ్యపథంలో ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. తమను హౌస్ అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.