తెలంగాణ

telangana

ETV Bharat / state

చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించనున్న కాంగ్రెస్‌ - నేడు రాష్ట్రంలో రాహుల్, ప్రియాంక ప్రచారం

Congress Leaders Election Campaign Telangana 2023 : రాష్ట్రంలో అధికారం ఛేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించడానికి కాంగ్రెస్‌ సిద్ధమైంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక గాంధీలతోపాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిలు ప్రచారంలో పాల్గొనున్నారు. ఒకవైపు ప్రచారాలు చేస్తూనే.. మరోవైపు పోల్ మేనేజ్‌మెంట్​పై ప్రత్యేక దృష్టి సారించింది.

Congress Top Leaders Election Campaign Today
Congress Leaders Election Campaign

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 8:29 AM IST

చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించనున్న కాంగ్రెస్‌ - నేడు హైదరాబాద్‌ రోడ్‌ షోలో అగ్రనాయకులు

Congress Leaders Election Campaign 2023: చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించడానికి కాంగ్రెస్‌ సిద్ధమైంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక గాంధీలతోపాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిలు ప్రచారంలో పాల్గొనున్నారు. కంటోన్మెంట్‌, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరిలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో ఆఖరి రోజైన ఇవాళ.. కాంగ్రెస్‌అగ్రనేతలు సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో తీరిక లేకుండా గడపనున్నారు. జూబ్లీహిల్స్‌ ఆటోవర్కర్స్‌, జీహెచ్‌ఎంసీ, గిగ్‌ వర్కర్స్‌ యూనియన్లతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమావేశం కానున్నారు. అనంతరం నాంపల్లి నియోజకవర్గంలో రోడ్‌ షో నిర్వహించి.. కార్నర్‌ సమావేశంలో ప్రసంగిస్తారు.

'బీఆర్​ఎస్ పాలనలో మీ అవస్థలు, మీకు జరిగిన అవమానాలు తెలుసు - మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదో అవకాశం'

Congress Top Leaders Election Campaign Today :ప్రియాంక గాంధీ జహీరాబాద్‌ నియోజకవర్గ ఎన్నికల సభలో పాల్గొని ప్రచారం చేస్తారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్‌ రెడ్డితో పాటు అగ్రనాయకులు కలిసి కట్టుగా హైదరాబాద్‌ నగరంలో రోడ్‌ షో నిర్వహించాలని యోచిస్తున్నారు. కంటోన్మెంట్‌, ఉప్పల్‌, కుత్భుల్లాపూర్‌, మల్కాజిరి నియోజకవర్గాలల్లో రోడ్‌ షోలో పాల్గొని కార్నర్‌ సమావేశంలో మాట్లాడతారని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తాను పోటీ చేస్తున్న కామారెడ్డిలో చివరి రోజున ప్రచారం చేసేందుకు వెళ్లనున్నారు.

Congress Focus on Poll Management in Telangana : ప్రచారపర్వం ముగియనుండటంతో.. పోల్‌ మేనేజ్‌మెంట్‌పై కాంగ్రెస్‌ దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ అసంతృప్తితో ఉన్న వర్గాలతోపాటు, తటస్థ ఓటర్లు.. హస్తం గుర్తుపై ఓటేసేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేష్‌ సహా కీలక నేతలు.. పోల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సాయంత్రం ప్రచారం ముగిసిన తరువాత బయట నుంచి వచ్చిన కాంగ్రెస్‌ అగ్రనేతలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లనున్నారు.

ఈసారి రెండుచోట్ల కేసీఆర్‌కు ఓటమి తప్పదు: రేవంత్‌రెడ్డి

Congress Election Campaign :ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ రెండు ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని శ్రమిస్తోంది. ఇటీవలి కర్నాటక ఎన్నికల గెలుపు స్ఫూర్తితో రాష్ట్రంలోనూ అదే తరహా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఆయా వర్గాలే లక్ష్యంగా గ్యారంటీలు ప్రకటించి.. గతానికి భిన్నంగా దూకుడుగానే వెళ్తోందని చెప్పవచ్చు. పొత్తులో భాగంగా సీపీఐకి ఓ స్థానాన్ని కేటాయించిన హస్తం పార్టీ.. కోదండరాం నేతృత్వంలోని జనసమితి మద్దతు పొందింది. షర్మిల నేతృత్వంలోని వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ(YSRTP) సంఘీభావం ప్రకటించింది.

బీఆర్​ఎస్​, బీజేపీ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు : ప్రియాంక గాంధీ

హ్యాట్రిక్‌పై ఒకరు- మార్పు కోసం మరొకరు- డబుల్ ఇంజిన్ సర్కార్​ ఏర్పడాలని ఇంకొకరు

ABOUT THE AUTHOR

...view details