తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ పోలీసులపై న్యాయ విచారణ చేపట్టాలి: కుంతియా

ప్రియంక గాంధీపట్ల అనుచిత వైఖరిని ప్రదర్శించిన పోలీసు ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

congress leaders demanding for legal enquiry on lucknow incident
'గాంధీ కుటుంబంపై భాజపా కక్ష సాధిపు చర్యలకు పాల్పడుతోంది'

By

Published : Dec 29, 2019, 9:53 PM IST

భాజపా ప్రభుత్వం గాంధీ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి ఆర్సీ కుంతియా ఆరోపించారు. ఉత్తరప్రదేశ్​ లఖ్​నవూలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ 135 ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడానికొచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు అనుచిత ప్రవర్తనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. ఇప్పటికే ఎస్పీజీ భద్రతను తొలగించిన భాజపా సర్కారు... తాజాగా పోలీసులు అనుచిత వైఖరిని ప్రదర్శించారని ధ్వజమెత్తారు. ప్రజాదరణ కలిగిన మహిళా నేతపైన పోలీసులు ఇలా ప్రవర్తించడం హేయమైన చర్యని అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details