తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల ఎంపిక ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేస్తామని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే పలుమార్లు చర్చించామని... తుది నిర్ణయం తీసుకునే ముందు మరికొందిరి అభిప్రాయాలు తీసుకుని ఏకాభిప్రాయానికి రానున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్ధుల ఎంపికపై తాము ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అధికారిక ప్రకటన అధిష్ఠానం చేయాల్సి ఉన్నందున మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వివరించారు.
ఒకట్రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక : ఉత్తమ్ - Comments by Uttam Kumar Reddy
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేస్తామని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. అధికారిక ప్రకటన అధిష్ఠానం చేయాల్సి ఉన్నందున మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వివరించారు.
గురువారం హైదరాబాద్ రానున్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ సాయంత్రం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల మండలి అభ్యర్థి ఎంపికపై సీనియర్లతో సమావేశం అవుతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.
అదే విధంగా శుక్రవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల మండలి అభ్యర్ధి ఎంపికపై మాణిక్కం ఠాగూర్ చర్చిస్తారని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 నుంచి రెండు వరకు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికపై సమావేశమై చర్చిస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు.