తెలంగాణ

telangana

ETV Bharat / state

UTTAM: మాటలే కౌశిక్ రెడ్డివి.. స్క్రిప్ట్ అంతా తెరాసదే..: ఉత్తమ్ - telangana varthalu

పాడి కౌశిక్​రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్​ సీనియర్​ నేత ఉత్తమ్​ కుమార్​ రెడ్డి స్పష్టం చేశారు. కౌశిక్​రెడ్డి స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి కౌశిక్ రెడ్డి అలా మాట్లాడారని విమర్శించారు.

UTTAM: 'కౌశిక్​ రెడ్డి స్థాయిని మరిచి మాట్లాడారు'
UTTAM: 'కౌశిక్​ రెడ్డి స్థాయిని మరిచి మాట్లాడారు'

By

Published : Jul 12, 2021, 8:20 PM IST

Updated : Jul 12, 2021, 9:10 PM IST

హుజూరాబాద్ కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి పార్టీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి స్థాయి మరిచి పోయి ఇష్టానుసారంగా మాట్లాడారని, స్థాయి తెలుసుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నాయకులపై, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్​ పైన చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. తెరాస పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి కౌశిక్ రెడ్డి అలా మాట్లాడారని విమర్శించారు. 2018లో హుజూరాబాద్ టికెట్​ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లనే కౌశిక్ రెడ్డి నాయకుడయ్యాడని.. ఆ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీలోని నాయకులను విమర్శించడం సిగ్గు చేటని అన్నారు.

ఇదీ చదవండి: Kaushik Reddy: '50 కోట్లు ఇచ్చి రేవంత్ అధ్యక్షుడయ్యాడు.. ఆరునెలల్లో కాంగ్రెస్ ఖాళీ!'

Last Updated : Jul 12, 2021, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details