లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నాచారం, ఉప్పల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోడుప్పల్ నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టిన రేవంత్‌రెడ్డి ఉప్పల్‌లోని అశోక్‌నగర్‌లో నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి రోడ్‌షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చర్లపల్లి ప్రాంతంలో కనీసం సర్కారు దవాఖాన లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని విమర్శించారు.
అనంతరం నాచారంలో పర్యటించారు. ప్రచారానికి సమయం దాటినందున ప్రసంగం లేకుండా ఓటర్లకు దండాలు పెడుతూ ముందుకు సాగారు. రేవంత్‌రెడ్డి పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
నాచారం, ఉప్పల్‌లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. నియోజకవర్గాల్లో పర్యటనలు, రోడ్‌షోలతో ప్రజలతో మమేకం అవుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి నాచారం, ఉప్పల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రేవంత్‌రెడ్డి
ఇదీ చదవండి :ఎన్నికల కూలీలు...అన్ని సేవలూ ఉచితం