ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో మాట తప్పిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు సంక్షేమ దీక్షలో భాగంగా ఆయన ఇంట్లోనే దీక్షకు కూర్చున్నారు. 25శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయకుండానే గన్నీ బ్యాగులు లేవని చెప్పితే...మిగిలిన 75శాతం ఎలా కొనుగోలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. కొవిడ్-19 కిట్ల విషయంలోగాని, వలస కార్మికుల గణాంకాల విషయంలో ఒక్కో నేత ఒక్కో మాట చెబుతున్నారని.. ఎవరిది నిజమని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం మాట తప్పింది: పొన్నాల
కాంగ్రెస్ చేపట్టిన రైతు సంక్షేమ దీక్షలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లోనే దీక్షకు పూనుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో సర్కారు మాట తప్పిందని ఆయన ఆరోపించారు.
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం మాట తప్పింది: పొన్నాల