తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Leader Kumbam ShivaKumar Booked in Rape Case : కాంగ్రెస్​ నేత కుంభం శివకుమార్​పై మరో అత్యాచారం కేసు - కాంగ్రెస్​ నేత శివకుమార్​పై బెంగళూరులో రేప్​ కేసు

Congress Leader Kumbam ShivaKumar Booked in Rape Case : తెలంగాణ కాంగ్రెస్​ నాయకుడు కుంభం శివకుమార్​పై బెంగళూరులో అత్యాచారం కేసు నమోదైంది. ఇది వరకే అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్​పై బెంగళూరులో మరో కేసు నమోదు కావడంతో రాజకీయంగా సంచలనంగా మారింది.

Congress Leader Kumbam ShivaKumar Booked in Rape Case
Congress Leader Kumbam ShivaKumar

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 9:54 AM IST

Congress Leader Kumbam ShivaKumar Booked in Rape Case : కాపాడాల్సిన నాయకులే కామాంధులగా మారుతున్నారు. నమ్మించి మోసం చేసి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రాజకీయనేత అని అహంకారామో లేక ఏం చేసినా నన్ను ఏం చేయలేరన్న ధీమానో తెలియదు కానీ కొంత మంది నేతల చర్యల వల్ల అమాయక ప్రజల జీవితాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన నాయకుడే ఒకిరిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. మరో యువతిని ఫైవ్​స్టార్​ హోటల్​కు తీసువచ్చి(Girl Rape Case) అత్యాచారానికి పాల్పడ్డాడు.

Rape Case on Congress Leader Kumbham Shivakumar : గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు తెలంగాణ కాంగ్రెస్ నేత కుంభం శివ కుమార్ రెడ్డి. తాజాగా ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఏడాది ఆగస్టులో ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి అత్యాచారం చేసినందుకు శివకుమార్ రెడ్డి ఇప్పటికే రేప్ కేసును ఎదుర్కొంటున్నాడు. అది ఓ కొలిక్కి రాకముందే ఇప్పుడు మరో కేసులో ఇరుక్కున్నాడు.

Meerpet Girl Gang Rape Case : మీర్​పేట్ గ్యాంగ్​ రేప్​ కేసు.. ఏడుగురు నిందితుల అరెస్ట్

Rape Case Booked onKumbham Shivakumar Reddy :శివ కుమార్​ రెడ్డి బెంగళూరులోని ఓ ఫైవ్​ స్టార్​ హోటల్​లో ఓ యువతిపై అత్యాచారానికిపాల్పడినట్లు సమాచారం. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. తనన హోటల్​కు రమ్మని అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతడిపే కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు ఓ యువతిని ఏదో పని మీద పిలిచిన శివకుమార్ రెడ్డి.. ఆమె అక్కడికి వచ్చిన తర్వాత అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకున్న బాధితురాలు తనపై అత్యాచారంచేశాడని శివకుమార్​పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో కుంభం శివ కుమార్ రెడ్డిపై బెంగళూరులో ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదైందని పోలీసు అధికారులు తెలిపారు.

ఇది వరకే తనపై అత్యాచారం కేసు : ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కుంభం శివకుమార్‌ రెడ్డిపై ఓ కేసు నమోదైంది. ఆ సమయంలో ఆయన నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. అయితే శివకుమార్.. తన భార్య అనారోగ్యంతో ఉందని చెప్పి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకుని మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో పోలీసులు శివకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

బ్రేకప్ చెప్పిందని కోపం.. పట్టపగలే ప్రియురాలిపై కత్తితో దాడి.. బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్

ఈయన 'స్కెచ్' వేస్తే నేరస్థులకు వణుకే.. 500 మందిని పట్టించిన నితిన్!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details