తెలంగాణ

telangana

ETV Bharat / state

బీ-ఫారా​ల పంపిణీ ప్రారంభించిన కాంగ్రెస్ - telangana municipal elections updates

పురపోరులో సత్తా చాటాలని కృత నిశ్చయంతో ఉన్న కాంగ్రెస్.. కసరత్తు పూర్తి చేసింది. పార్టీకి విధేయులు, ఫిరాయింపులు చేయని వారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ పెద్దలు.. ఇవాళ్టి నుంచి బీ-ఫార్మ్​ల పంపిణి ప్రారంభించారు.

congress issued bforms to their candidates
బీ-ఫారా​ల పంపిణీ ప్రారంభించిన కాంగ్రెస్

By

Published : Jan 10, 2020, 11:37 PM IST

కాంగ్రెస్​ బీ ఫారాల పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన బీ ఫారాలు ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఆ పార్టీ ​రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అందజేశారు. పంపిణి కార్యక్రమం రేపు సాయంత్రం లోపు పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి సీజే శ్రీనివాస్‌కు ఉత్తమ్​ సూచించారు.

రేపు సాయంత్రం లోపు నామినేషన్ల పరిశీలన పూర్తి కానుండడంతో అప్పటికల్లా... బీఫారాలు డీసీసీలకు చేరినట్లయితే ఎల్లుండి బీఫారాలను ఆయా మున్సిపాలిటీల, నగరపాలక సంస్థల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు అందచేస్తారు.

బీ-ఫారా​ల పంపిణీ ప్రారంభించిన కాంగ్రెస్

ఇవీచూడండి: పురపోరుకు 21,850 నామినేషన్లు.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో..

ABOUT THE AUTHOR

...view details