ఎన్నికలు సక్రమంగా జరగాలంటే అవినీతి అధికారులను వెంటనే ఆయా విధుల నుంచి తప్పించాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో అమరేందర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫాం 7 ఫిర్యాదులపై ఎలాంటి విచారణ జరపకుండానే ఓట్ల తొలగింపునకు ప్రొసీడింగ్స్ ఇచ్చారని పేర్కొన్నారు. తక్షణం ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.
ఇబ్రహీంపట్నం ఆర్డీవోపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు - మల్రెడ్డి రంగారెడ్డి
అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అమరేందర్పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపిటీసీ, జడ్పీటీసీల బృందం ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు