తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా విజృంభిస్తోంది... మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయండి'

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిషనర్​ జి.నిరంజన్ డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథికి లేఖ రాసినట్లు వెల్లడించారు.

congress election commissioner niranjan on municipal election
'కరోనా విజృంభిస్తోంది... మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయండి'

By

Published : Apr 15, 2021, 10:58 AM IST

కరోనా ఉద్ధృతి దృష్ట్యా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయవద్దని రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథికి... కాంగ్రెస్ ఎన్నికల కమిషనర్​ జి.నిరంజన్ లేఖ రాశారు. నేడు ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి.. ఏప్రిల్ 30వ తేదీన పోలింగ్ నిర్వహిస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయని పేర్కొన్నారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజలను, ఓటర్లను, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో... అలుగుల అశోకరెడ్డి ఉద్యోగం కోసం విన్నవిస్తే... ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్​కు లేఖ రాశామని వెల్లడించారు.

ఇదీ చూడండి:ఇవాళ ఒక్కరోజే ఉంది... అప్రమత్తంగా ఉండండి..!

ABOUT THE AUTHOR

...view details