వలసకార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నందున అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్థికంగా సహకరించాలని నిర్ణయించింది. సోనియా గాంధీ పిలుపు మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తమ స్థోమతను బట్టి విరాళాలు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గాంధీభవన్‌లో రైతు సంక్షేమ దీక్ష చేసిన సందర్భంగా చేసిన వినతికి వెంటనే స్పందించిన కొందరు నేతలు అక్కడిక్కడనే తమ విరాళాలను ప్రకటించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పది లక్షలు, మాజీ మంత్రి చంద్రశేఖర్ రెండు లక్షలు, హనుమంతరావు, పొన్నం ప్రభాకర్‌లు లక్ష రూపాయల చొప్పున ప్రకటించారు. వీరితోపాటు మరికొందరు నేతలు యాభైవేలు...ఇరవై అయిదు వేలు లెక్కన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు అంతా కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
వలస కార్మికులకు సాయమందించేందుకు కాంగ్రెస్ నిర్ణయం - lock down
సోనియా గాంధీ పిలుపు మేరకు వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఆర్థికంగా సహకరించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తమ స్థోమతను బట్టి సాయం అందజేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.
వలస కార్మికులకు సాయమందించేందుకు కాంగ్రెస్ నిర్ణయం