కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే భోజ గుట్టపై ఇళ్లు, పట్టాలు ఇప్పిస్తానని గుడిమల్కాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి వేణు గౌడ్ హామీ ఇచ్చారు. తెరాస ప్రభుత్వం నేనే రాజు... నేనే మంత్రి అనే తరహాలో పరిపాలన చేస్తోందని విమర్శించారు. ఆ ధోరణిని ప్రజలు సహించడం లేదని అన్నారు.
తెరాసది నేనే రాజు.. నేనే మంత్రి పాలన: వేణు గౌడ్ - జీహెచ్ఎంసీ ఎన్నికలు లేటెస్ట్ న్యూస్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. గుడిమల్కాపూర్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి వేణు గౌడ్ పాల్గొన్నారు. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
CONG
ఒక్కసారి కాంగ్రెస్‌ని గెలిపిస్తే గుడిమల్కాపూర్ ప్రజల హామీలను తప్పకుండా నెరవేర్చుతానని చెప్పారు.
ఇదీ చదవండి:ఓటుపై సినీ ప్రముఖులు ఏమన్నారంటే!