తెలంగాణ

telangana

ETV Bharat / state

డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. పోలీసులకు, కాంగ్రెస్‌ నేతల మధ్య తోపులాట

opposition protest: రాష్ట్ర డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా, యూత్ కాంగ్రెస్ నాయకులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. జూబ్లీహిల్స్​లో బాలికపై రేప్ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో బీజేవైఎం ఆధ్వర్యంలో జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

congress protest
డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

By

Published : Jun 4, 2022, 3:44 PM IST

Updated : Jun 4, 2022, 4:29 PM IST

opposition protest: రాష్ట్రంలో మహిళాలకు రక్షణ లేదని కాంగ్రెస్‌ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో జరిగిన బాలిక అత్యాచార ఘటనను నిరసిస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌, యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించారు. డీజీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోగా మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుంది. ఆందోళనకారులను అరెస్టు చేసిన నాంపల్లి పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఒక బాలికపై అత్యాచారం జరిగితే ఇంత వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ ఎందుకు స్పందించలేదని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. అత్యాచార ఘటన నిందితులను ఇప్పటికే దుబాయ్‌కి పంపించారని ఆరోపించారు. ఈ ఘటనలో నిజమైన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

opposition protest: బాలికపై అత్యాచారం జరిగి ఐదు రోజులవుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని యువజన కాంగ్రెస్ హైదరాబాద్‌ నగర అధ్యక్షుడు మోత రోహిత్ మండిపడ్డారు. నిందితులను శిక్షించాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హోంమంత్రిని ఆదేశించడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. కేటీఆర్, హోంమంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డీజీపీ వెంటనే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని యూత్ కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

జాతీయ రహదారిపై బీజేవైఎం ఆందోళన:జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జాతీయ రహదారిపై బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశిష్ గౌడ్ ఆరోపించారు.

పోలీసులు తెరాసకు, ఎంఐఎంకు అనుకూలంగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు పోలీసుల మీద నమ్మకం పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎదురు తిరిగితే ఎవరూ ఏమీ చేయలేరని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా పోలీసులపై ప్రజల నమ్మకం కలిగేలా పని చేయాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశిష్ గౌడ్ హితవు పలికారు.

డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. పోలీసులకు, కాంగ్రెస్‌ నేతలకు తీవ్ర వాగ్వాదం

ఇవీ చూడండి:జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. ఐదుగురు నిందితులు అరెస్టు..!

డ్రగ్స్​ కోసం డబ్బులు అడిగాడని యువకుడి దారుణ హత్య.. అందరి ముందే..!

Last Updated : Jun 4, 2022, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details