ఐటీ సంస్థల పునప్రారంభంతో హైదరాబాద్ హైటెక్ సిటీలో రద్దీ పెరిగింది. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అప్పటి నుంచి హైటెక్ సిటీ ప్రాంతం అంతా వెలవెలబోయింది.
ఆ సడలింపుతో హైటెక్ సిటీలో రద్దీ
లాక్డౌన్ కారణంగా వెలవెలబోయిన హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఇవాళ రద్దీగా పెరిగింది. ప్రభుత్వ సడలింపులతో కొన్ని ఐటీ కంపెనీలు తెరుచుకున్నాయి.
hitech city
33 శాతం మందితో ప్రైవేట్ ఆఫీసులు పనిచేయవచ్చని ప్రభుత్వం సడలింపు ఇవ్వడంతో ఇవాళ కొన్ని సంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆయా సంస్థల ఉద్యోగుల రాకతో హైటెక్ సిటీ ప్రాంతంలో వాహనాల రద్దీ పెరిగింది.
ఇదీ చదవండి:ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించొద్దు: కేసీఆర్