హైదరాబాద్ గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కార్మికులు ఆందోళనకు దిగారు. మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను నిర్లక్ష్యంగా విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి భాజపా నేతలు సంఘీభావం తెలిపారు.
టిమ్స్ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఆందోళన ఎందుకంటే.. - హైదరాబాద్ తాజా వార్తలు
గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంట్రాక్టు కార్మికులు ఆందోళన
భాజపా నేత రవికుమార్ యాదవ్ టిమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇషా అహ్మద్ ఖాన్‌తో మాట్లాడారు. వారికి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే భాజపా తరపున ఆందోళన తీవ్రతరం చేస్తామని రవికుమార్ యాదవ్ తెలిపారు.
ఇదీ చదవండి: రెగ్యులరైజ్ చేయకుంటే సమ్మె తప్పదు.. నిమ్స్‌లో నర్సుల వార్నింగ్