తెలంగాణ

telangana

ETV Bharat / state

అటవీ భూముల సమస్యపై గవర్నర్​కు ఫిర్యాదు - tdp

అటవీ భూముల సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్ష నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో పార్టీల నేతలు కోదండరాం, ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, పల్లా వెంకట్‌ రెడ్డి, గోవర్ధన్‌ ఇవాళ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

గవర్నర్​కు ఫిర్యాదు

By

Published : Jul 10, 2019, 10:30 PM IST

అటవీభూముల హక్కు చట్టాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయాడంలేదని ఆరోపిస్తూ.. అఖిలపక్ష పార్టీల నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అటవీ భూముల సమస్యలను పరిష్కరించాలని గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో అఖిలపక్ష పార్టీల నేతలు కోదండరాం, ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, పల్లా వెంకట్‌ రెడ్డి, గోవర్ధన్‌ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

పోడు భూముల విషయంలో ప్రభుత్వానికి, గిరిజనులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని కోదండరాం అన్నారు. 2006లో ఆదివాసులకు చట్టబద్ధత కల్పించిన చట్టం సరిగ్గా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి పాస్‌ పుస్తకం ఇస్తే భూమి ఇవ్వలేదని.. మరికొందరికి భూమి ఇస్తే.. పాస్‌ పుస్తకం ఇవ్వలేదని కోదండరాం పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో ఆదివాసీల జీవనానికి ఉపయోగించే భూమిని రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని తెతేదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ దుయ్యబట్టారు. 2006 అటవీభూముల చట్టం ప్రకారం ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరారు.

గవర్నర్​కు ఫిర్యాదు

ఇవీ చూడండి: కేసీఆర్ సొంత గ్రామానికి రూ.10కోట్ల ప్రత్యేక నిధులు

ABOUT THE AUTHOR

...view details