తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజాసింగ్​పై మరో కేసు.. బెయిల్​ రద్దు చేయించేందుకే అంటూ ఎమ్మెల్యే మండిపాటు - రాజాసింగ్‌పై షాహినాజ్ గంజ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు

complaint against to goshamahal MLA rajasing: హైదరాబాద్‌ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్రలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఒక వర్గాన్ని కించపరిచేలా నినాదాలు చేశారని ఎస్సై రాఘవేందర్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

complaint against to goshamahal MLA rajasingh
వివాదాల కింగ్​ రాజాసింగ్​పై మరో కేసు..

By

Published : Apr 2, 2023, 2:24 PM IST

complaint against to goshamahal MLA rajasing: హైదరాబాద్‌ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. రాజాసింగ్​పై షాహినాయత్‌గంజ్ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు చేశారు. ఎస్సై రాఘవేందర్ ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌పై కేసు ఫైల్​ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. ఓ వర్గాన్ని కించపరిచేలా నినాదాలు చేశారని ఫిర్యాదులో రాఘవేందర్‌ పేర్కొన్నారు. చుడి బజార్‌లో శోభాయాత్రలో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎస్సై రాఘవేందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందుత్వ దేశంగా మారాలని రాజాసింగ్ వ్యాఖ్యానించడంతో ఆయన అనుచరులు గాడ్సే ఫొటో ప్రదర్శించడంతో పాటు ఓ వర్గాన్ని కించపరిచేలా నినాదాలు చేశారని ఎస్సై తన ఫిర్యాదులో వివరించారు.

రాజాసింగ్​ స్పందన :తనపై పెట్టిన కేసుపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తనకు వచ్చిన బెయిల్​ను రద్దు చేయించేందుకే తనపై అనవసర కేసులు బనాయిస్తున్నారంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. తెలంగాణలో ధర్మంవైపు మాట్లాడినా, గోవధను వ్యతిరేకించినా, లవ్ జీహాద్ పై మాట్లాడినా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అసలు తెలంగాణ భారత్​లో ఉందా.. పాకిస్తాన్​లో ఉందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్.. శ్రీరామ నవమిరోజే నన్ను చంపాలకున్నామని.. రంజాన్ తర్వాత తప్పక చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. తనకు ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి కాల్స్ వస్తున్నాయా లేక ఓల్డ్ సిటీలోని కొందరు నెట్ నుంచి ఇలా కాల్స్ చేస్తున్నారా అని తేలాల్సి ఉందన్నారు.

గతంలోనూ అంతే: గత సంవత్సరం కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారనే కారణంతో హైదరాబాద్ పోలీసులు రాజాసింగ్​ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్​పై బయట ఉన్నారు. అయినప్పటికీ మళ్లీ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని రాజాసింగ్​కు వ్యతిరేకంగా ఫిర్యాదులు వస్తున్నాయి.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ చాలా సార్లు అభ్యంతరకర మాటలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలైన తన యూట్యూబ్ ఛానల్​​లో పెట్టడం లాంటివి చేశారు. ఆయన చేసిన వీడియోలు, వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం చెంది ఆయనపై ఫిర్యాదులు చేశారు. రాజాసింగ్​కు వ్యతిరేకంగా ర్యాలీలు, ఆందోళనలు కూడా జరగడం వల్ల ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ముందు ఆయనను హాజరు పరిచారు. అయితే కోర్టు ఆయనకు ముందుగా నోటీసులు ఇవ్వకపోవడం వల్ల పిటిషన్​ను కొట్టివేసి ఆయనను విడుదల చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details