తెలంగాణ

telangana

ETV Bharat / state

అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సమస్య పరిష్కారానికి కమిటీ - AP Government Latest decisions news

అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సమస్యను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సీనియర్ అధికారుల కమిటీ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆరుగురు సీనియర్ అధికారుల కమిటీ ఛైర్మన్​గా గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణద్వివేదీ వ్యవహరిస్తారు.

committee-to-resolve-the-issue-of-international-mediation
అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సమస్య పరిష్కారానికి కమిటీ

By

Published : Dec 9, 2020, 4:53 PM IST

రస్-అల్-ఖైమా ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ లేవనెత్తిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సమస్యను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వివిధ ప్రత్యామ్నాయాలను రూపొందించడానికి సీనియర్ అధికారుల కమిటీ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీఎండీసీ, ఏఎన్​ఆర్​ఏకే అల్యూమినియం లిమిటెడ్ మధ్య బాక్సైట్ సరఫరా ఒప్పందం రద్దు అంశంపై నెలకొన్న సమస్య పరిష్కారంపై కమిటీ పనిచేస్తుందని ఆదేశాల్లో తెలిపింది.

ఆరుగురు సీనియర్ అధికారుల కమిటీ ఛైర్మన్​గా గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణద్వివేదీ వ్యవహరిస్తారు. కమిటీలో సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధితో సహా గనులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు నియమించారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పి.వి.చలపతి రావు, కె.వి.వి సత్యనారాయణ, ఏపీఎండీసీ ఎండీ హరినారాయణ, కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ వీణకుమారి.. థర్మల్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వి.జి. వెంకటరెడ్డి సభ్యులుగా ఉన్నారు. నెల రోజుల్లోగా సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కమిటీని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.

ఇదీ చదవండీ:వరద బాధితులకు ఆర్థికసాయం ప్రక్రియ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details