తెలంగాణ

telangana

ETV Bharat / state

'చేతులు ఎత్తడం ద్వారానే మేయర్ ఎన్నిక' - జీహెచ్​ఎంసీ కమిషనర్​ సమావేశం

గ్రేటర్​ హైదరాబాద్​ నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్​ ఎన్నికకు సన్నాహకాలు మొదలయ్యాయి. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో పలు పార్టీల నేతలతో కలిసి కమిషనర్​ లోకేష్​ కుమార్​ సమావేశం నిర్వహించారు.

ghmc, mayor election
జీహెచ్​ఎంసీ, మేయర్ ఎన్నిక

By

Published : Feb 9, 2021, 3:01 PM IST

జీహెచ్‌ఎంసీకి నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం రోజు తమ వెంట గుర్తింపు కార్డుతో పాటు.. అధికారులు జారీ చేసిన పత్రాలు తీసుకుని కౌన్సిల్ హాల్‌కు రావాలని కమిషనర్ లోకేష్‌ కుమార్ స్పష్టం చేశారు. సభ్యుల ప్రమాణ స్వీకారం తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో ఉంటుందని తెలిపారు. ప్రమాణ స్వీకారం, మేయర్ ఎన్నికపై నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో కమిషనర్‌ సమావేశం నిర్వహించారు. గ్రేటర్​లో ప్రాతినిధ్యం ఉన్న తెరాస, భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీల నుంచి సమావేశానికి నేతలు హాజరయ్యారు.

సభ జరిగే విధానం, సభ్యులు అనుసరించాల్సిన పద్ధతిని రాజకీయ పార్టీల నేతలకు కమిషనర్‌ వివరించారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కలిపి 97 మంది సభ్యులు ఉంటే మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు చేతులు ఎత్తడం ద్వారా ఎన్నిక జరుగుతుందని లోకేష్‌ కుమార్ వెల్లడించారు. ఈ సమావేశానికి తెరాస నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎంఐఎం నుంచి సయ్యద్ అమీనుల్ జాఫ్రీ, కాంగ్రెస్ నేత నిరంజన్, శంకర్ యాదవ్‌, భాజపా నుంచి దేవర కర్ణాకర్‌ హాజరయ్యారు.

ఇదీ చదవండి:'కర్తవ్యంలోనే కాదు.. క్రీడల్లోనూ నంబర్ వన్'

ABOUT THE AUTHOR

...view details