తెలంగాణ

telangana

ETV Bharat / state

తుది దశలో కమాండ్ కంట్రోల్ సెంటర్ - తుది దశలో కమాండ్ కంట్రోల్ సెంటర్

హైదరాబాద్​కు మరో ఐకాన్ రాబోతుంది. అదే కమాండ్ కంట్రోల్ సెంటర్. ఇది అందుబాటులోకి వస్తే.. అన్ని శాఖలతో సమన్వయం సాధ్యమవుతుందని పోలీస్ శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అనేక ప్రత్యేకతలతో... అత్యంత సాంకేతికత పరిజ్ఞానంతో దీని నిర్మాణం బంజారాహిల్స్​లోని రోడ్ నంబర్ 12లో జరుగుతోంది.

తుది దశలో కమాండ్ కంట్రోల్ సెంటర్

By

Published : Jul 7, 2019, 1:56 PM IST

తుది దశలో కమాండ్ కంట్రోల్ సెంటర్

హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. రాష్ట్ర ప్రజలకు మరింత భద్రత, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా సేవలు అందించే దిశగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుపుతున్నారు. రాష్ట్ర ప్రజల భద్రతే ప్రధాన ధ్యేయంగా సుమారు రూ.200 కోట్లతో సీసీసీ రూపుదిద్దుకుంటుంది. ఏడెకెరాల సువిశాల స్థలంలో సుమారు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో మొత్తం ఏబీసీడి అను నాలుగు టవర్లను నిర్మిస్తున్నారు.

ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్​ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల సీసీసీలతో అనుసంధానం చేస్తారు. విపత్తులు సంభవించినప్పుడు, దసరా, వినాయక నిమజ్జనం, రంజాన్ తదితర పండుగల సందర్భాల్లో బందోబస్తు, రక్షణకు సంబంధించిన అంశాలపై పర్యవేక్షించే వీలుటుంది. అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే హెలిప్యాడ్ అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి అధికారులు నేరుగా సంఘటనా స్థలానికి చేరుకునే సౌలభ్యం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.


ఏ-టవర్​లో మొత్తం 20 అంతస్తులు ఉంటాయి. ఇందులో ఓపెన్ కార్యాలయం, మీటింగ్ గదులు, కాన్ఫరెన్స్ గదులు, క్యాబిన్స్ ఉంటాయి. వీటితో పాటు ముఖ్యమంత్రి ,హోంశాఖ మంత్రి, సీపీ క్యాబిన్​లను ఏర్పాటు చేశారు. ఏ టవర్​పై హెలిప్యాడ్​ను నిర్మాణం చేస్తున్నారు. బి-టవర్​లో మొత్తం 15 అంతస్తులు ఉంటాయి. డీజీపీ, సీ.ఎస్ క్యాబిన్, డయల్ 100 కార్యాలయాలు ఉంటాయి. సీ-టవర్ లో 15 అంతస్తులు ఉంటాయి. ఇందులో సమావేశ మందిరం,ఇతర గదుల నిర్మాణం చేశారు. డీ-టవర్ లో కూడా 15 అంతస్తులు ఉంటాయి. ఇందులో మీడియా సమావేశాలకోసం, క్యాంటీన్, శిక్షణ తరగతుల కోసం గదుల నిర్మాణం చేశారు. ఇందులో 4,5,6,7 అంతస్తుల్లో డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, మంత్రుల క్యాబిన్​లు, వార్ రూమ్​లు నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం సువిశాల స్థలం కేటాయించారు. నాలుగు టవర్లను కలుపుతూ... ఐదు స్కైవే వంతెనలను ఏర్పాటు చేశారు. ఒక్కో వంతెనను 450 మెట్రిక్ టన్నుల బరుతో, 120 అడుగుల పొడవుతో నిర్మాణం చేపట్టారు. ఈ స్కై వంతెనలు దేశంలోనే అత్యంత బరువైన వంతెనలని నిర్మాణాదారులు చెబుతున్నారు.

మరికొద్ది రోజుల్లోనే సీసీసీ నిర్మాణం పూర్తికాబోతుంది. ఇప్పటికే పనులు తుది దశకు చేరుకున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వస్తే..అనేక అద్భుతాలు జరుగుతాయని పోలీస్ శాఖ అంచనా వేస్తోంది.

ఇదీ చూడండి.ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం

ABOUT THE AUTHOR

...view details