హైదరాబాద్ సుల్తాన్ బజార్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై సహోద్యోగులు సంతాపం తెలిపారు. 2009 బ్యాచ్‌కి చెందిన సీఐ ఎస్.లక్ష్మణ్, ఆయన భార్య రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి పిల్లలకు అండగా ఉండేందుకు తోటి ఉద్యోగులు ముందుకు వచ్చారు.
సీఐ కుటుంబానికి అండగా నిలిచిన సహోద్యోగులు - తెలంగాణ వార్తలు
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సుల్తాన్ బజార్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కుటుంబానికి ఆయన సహోద్యోగులు అండగా నిలిచారు. 1100 మంది కలిసి రూ.35 లక్షలను అందజేశారు. సీఐ పిల్లలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
సీఐ కుటుంబానికి సహోద్యోగుల ఆర్థిక సాయం, సుల్తాన్ బజార్ సీఐ కుటుంబానికి సాయం
ఏపీ, తెలంగాణలోని ఆయన సహోద్యోగులు మొత్తం 1100 మంది కలిసి రూ.35లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. పిల్లలకు తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ఇదీ చదవండి:కరోనా మృత్యుఘోష.. మళ్లీ 4వేల పైకి మరణాలు