సురక్షిత తాగునీటి వినియోగం, నీటిపొదుపుతో పాటు మిషన్ భగీరథ విశిష్టతపై వచ్చే నెలలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 55 లక్షలకు పైగా ఇళ్లకు శుద్ధి చేసిన నీటిని నల్లాలతో సరఫరా చేయడం లేదని అన్నారు. మిషన్ భగీరథపై ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో స్మితా సబర్వాల్ సమీక్ష నిర్వహించారు.
మిషన్ భగీరథ పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి సంతృప్తితో ఉన్నారని చెప్పారు. త్వరలోనే సీఎం సమీక్ష నిర్వహిస్తారని అన్నారు. జులై చివరి నాటికి అన్ని ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేయాలని, ఆలస్యం అవుతున్న ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతిగృహాలు, రెండు పడకగదుల ఇళ్ల కాలనీలతో పాటు ప్రభుత్వ సంస్థలకూ భగీరథ నీటి సరఫరా కోసం ప్రతిపాదనలు పంపాలని అన్నారు.
'మిషన్ భగీరథ పనులపై సీఎం సంతృప్తితో ఉన్నారు' - smitha sabarval
ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్మితా సబర్వాల్ అన్నారు. మిషన్ భగీరథ పథకంపై సమీక్ష నిర్వహించారు.
' మిషన్ భగీరథ పనులపై సీఎం సంతృప్తితో ఉన్నారు'
ఇదీ చూడండి:పటిష్ఠమైన చట్టాలతోనే మెరుగైన సేవలు: కేసీఆర్