నదీ జలాల విషయంలో సీఎం కేసీఆర్ అవలంబిస్తోన్న దౌత్యనీతి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. తాగునీటి అవసరాల కోసం రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక అంగీకరించిన నేపథ్యంలో సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. లివ్ అండ్ లెట్ వివ్ నినాదంతో కేసీఆర్ పొరుగు రాష్ట్రాలతో నెరుపుతున్న దౌత్య విధానాలు ప్రాజెక్టులు సత్వరం పూర్తి కావడానికి, సాగు, తాగు నీటి కష్టాలు తీరడానికి ఉపయోగపడుతుందని ప్రకటనలో పేర్కొంది.
పొరుగు రాష్ట్రాలతో సీఎం దౌత్యనీతి భేష్ నేర్పుతో పరిష్కారం
పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి నీటి గొడవలు లేకుండా... సీఎం నేర్పుతో వివాదాలను పరిష్కరిస్తున్నారని సీఎంవో పేర్కొంది. మహారాష్ట్రతో దశాబ్దాలుగా ఉన్న నీటి సమస్యను కేసీఆర్ విజయవంతంగా అధిగమించి... చారిత్రక ఒప్పందం చేసుకున్నారని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల విషయంలోనూ సీఎం కేంద్రంతో చాకచక్యంగా వ్యవహరించారిని ప్రశంసించింది. తెలంగాణ విధానాలు చాలా విషయాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించింది.
ఇదీ చదవండి : కాళేశ్వరం ప్రాజెక్టుకు అదే గుండెకాయ