సింగరేణి ఏరియా జీఎంలతో సంస్థ సీఎండీ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం 2020-21లో 670 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ నిర్ణయించింది. 450 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఓబీని సైతం తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఐదు కొత్త ఉపరితల గనుల నుంచి అదనంగా 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కిష్టారం గని నుంచి 16 లక్షల టన్నులు, VKOC నుంచి 10 లక్షల టన్నులు, మేడేపల్లి నుంచి 6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కోసం వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఒడిశాలో సింగరేణికి కేటాయించిన నైనీ, న్యూ పాత్రపాద గనుల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సీఎండీ తెలిపారు.
ప్రత్యేక రైల్వే లైన్...
సుమారు 350 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న నైనీ గనిలో... 2021 మార్చి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. 50 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలని సీఎండీ అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. వేగం పుంజుకున్న తర్వాత... 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ తలుస్తోంది. నైనీ బ్లాకు నుంచి పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి జరగనుండగా... కోల్ ఇండియాతో కలిసి ప్రత్యేక రైల్వే లైను ఏర్పాటు చేయాలని సింగరేణి తలచింది.
ఏజెన్సీని నియమించాలి !!