CM Revanth Reddy Review on Rythu Bharosa Scheme :వరుస సమీక్షలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు తక్షణం ప్రారంభించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ట్రెజరీలో(Treasury) ఉన్న నిధులు విడదల చేయాలని నిర్దేశించారు
రైతులకు యాసంగి పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభం
రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కానందున.. గతంలో మాదిరి రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపులు చేయాలని ఆదేశించారు. అర్హులైన అన్నదాతల ఖాతాల్లో తక్షణం జమ అయ్యేలా చూడాలని రైతుభరోసాపై సచివాలయంలో జరిపిన సమీక్షాసమావేశంలో యంత్రాంగానికి సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు(Agriculture Officials) పాల్గొన్నారు. రైతుభరోసా సొమ్ము వెంటనే రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చెల్లింపులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి - అసెంబ్లీలో దడదడలాడించడమే కాదు - కిచెన్లో ఘుమఘుమలాడించడమూ తెలుసు
సచివాలయంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, ఆబ్కారీ శాఖ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ అధికారులు(Excise Department Officials) పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్ల సమాచారంపై ఆరాతీశారు. అంతకుముందు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు.
CM Revanth Reddy on Drugs :సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, హెచ్ న్యూ అదనపు డీజీ సీవీఆనంద్, సీఐడీ అదనపు డీజీ మహేష్ భగవత్, పోలీసు అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిపై యత్రాంగంతో సమాలోచనలు చేశారు. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, కొకైన్, హెరాయిన్(Heroin) సరఫరాను నియంత్రించి వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.