CM Revanth Reddy on New Power Policy in Telangana: రాష్ట్రంలో త్వరలోనే నూతన విద్యుత్ విధానం తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగ నిపుణులు, ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. శాసనసభలో చర్చించి కొత్త విద్యుత్ విధానం అమలు చేస్తామని సీఎం పేర్కొన్నారు. ఇప్పటి వరకు సరైన విద్యుత్ పాలసీ(Telangana New Power Policy) లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి విద్యుత్ రంగంపై రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన ఖరారు - ఈనెల 15న జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు
CM Revanth Reddy Review Meeting on Power Policy: రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి, కొనుగోళ్లు, వినియోగం, నిరంతర సరఫరా, గృహజ్యోతి పథకం అమలుకు చర్యలు, డిస్కంల పనితీరు, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై సమీక్షలో సీఎం చర్చించారు. రాష్ట్రావిర్భావం తర్వాత జరిగిన విద్యుత్ ఒప్పందాల(Electricity contracts in Telangana)పై పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కువ ధరకు చెల్లించేలా జరిగిన ఒప్పందాలకు కారణాలను కూడా నివేదికలో పొందుపరచాలన్నారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు ఇచ్చే కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు.