CM Revanth Reddy Fires on BRS Party : రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బాధలో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని, కుంగుబాటు లక్షణాలతో ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజావాణిలో(Prajavani Program) దరఖాస్తు చేసిన మహిళకు కేటీఆర్ లక్ష రూపాయలు ఇవ్వడం సంతోషకరమేనన్నారు. కేటీఆర్ కూడబెట్టుకున్న లక్ష కోట్ల రూపాయల్లో లక్ష రూపాయలే ఇచ్చారని, మిగతా సొమ్ము కూడా పంచిపెట్టే పరిస్థితి కల్పిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజాపాలన కార్యక్రమానికి నోడల్ అధికారుల నియామకం
ప్రజల రక్తమాంసాలు పిప్పి చేసి సంపాదించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్థిక పరిస్థితిని అసెంబ్లీ ముందుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రోజంతా సమయం ఇస్తే చెప్పకుండా, ఇంటికెళ్లి కొత్త దుకాణంతెరిచారని విమర్శించారు. ఉపయోగపడే భవనాలను కూల్చి కొత్తవి కట్టారని ఆక్షేపించారు. ఇప్పటికే వందల వాహనాలు ఉండగా, కేసీఆర్ హయాంలో 22 ఖరీదైన కొత్త ల్యాండ్ క్రూయిజర్లు కొని విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు.
CM Revanth Reddy Comments on KTR :మూడోసారి అధికారంలోకి వస్తే వాడుకుందామనుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం సంపాదించిన ఆస్తుల తీరు ఇలా ఉందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీలోనూ కేటీఆర్, హరీశ్‌రావు(Harish Rao) తాపత్రయమే కనిపించింది కానీ, వారితో ఒక్కరు కూడా కలిసి రాలేదన్నారు.