'సీఎం' వాట్సాప్ ఖాతా రద్దు - whatsapp
రాజ్యసభ సభ్యుడు, తెదేపా నేత సీఎం రమేష్ వాట్సాప్ ఖాతాను వాట్సప్ సంస్థ నిలిపివేసింది. నిబంధనలు అతిక్రమించిన కారణంగా సేవలు కోల్పోయారని సంస్థ తెలిపింది. కానీ....
రాజ్యసభ సభ్యుడు, తెదేపా సీనియర్ నాయకుడు సీఎం రమేష్ వాట్సాప్ ఖాతాను వాట్సప్ సంస్థ నిలిపివేసింది. వాట్సాప్ సేవలు వాడుకునే హక్కును కోల్పోయారని సంస్థ తెలిపింది. గత కొద్దిరోజులుగా తన వాట్సాప్ ఖాతా పని చేయడం లేదంటూ సంస్థకు ఎంపీ సీఎం రమేష్ లేఖ రాశారు. తాను రాజ్యసభ సభ్యుడిననే విషయాన్ని కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన సంస్థ... ఫిర్యాదులు అందడంతోనే ఖాతాను రద్దు చేశామని స్పష్టం చేసింది. ఖాతా తొలగింపు వెనుక కేంద్రం కుట్ర ఉందని ఎంపీ రమేష్ అనుమానం వ్యక్తం చేశారు. తన ఫోన్.. వాట్సాప్ పై కేంద్రం నిఘా పెట్టడం వల్లే ఈ పరిస్థితి ఎదరై ఉంటుందన్నారు.