'సీఎం చెబితేనే వాళ్లు వింటారు సార్' - సీఎం దగ్గరికి పంపడి సారు...
ముఖ్యమంత్రి సారు ఫోన్ కొడితేనే వాళ్లు వింటారు సార్... లేకుంటే వాళ్లు చేయట్లేదు. నా తొమ్మిదెకరాల భూమి పట్టాలు ఇవ్వట్లేదంటూ పంజాగుట్టలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చాడు ఓ 70 ఏళ్ల రైతు.
సీఎం దగ్గరికి పంపడి సారు...
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామానికి చెందిన రైతు పడాల ఎల్లయ్య భూమి పట్టాల కోసం అధికారుల చుట్టు తిరిగాడు. తండ్రి నుంచి తనకు సంక్రమించిన తొమ్మిదెకరాల భూమికి పట్టాలు ఇవ్వాలని మండల అధికారులను, జిల్లా స్థాయి అధికారులను కలిసి మొరపెట్టుకున్నాడు. ఎంతకీ పనికాకపోవడం వల్ల దిక్కుతోచని స్థితిలో ముఖ్యమంత్రిని కలిసేందుకు హైదరాబాద్ వచ్చాడు.