వక్ఫ్‌బోర్డు వ్యవహారాలను సత్వరమే సరిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయమై ఇదివరకే సభలో తీర్మానం చేసినట్లు స్పష్టం చేశారు. కానీ కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలపనందున అది అలాగే ఉండిపోయిందని... మరోసారి సభ తీర్మానానికి కూడా సిద్ధమని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మెట్రోరైల్‌ను పాతబస్తీకి విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రానికి ఏదో ప్రమాదం వస్తోందని కాంగ్రెస్ నేతలు ప్రజలను భయపెడుతున్నారని... కానీ ఆ ప్రమాదం రాష్ట్రానికి కాదు వాళ్ల పార్టీకే అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి కాదు.. కాంగ్రెస్ పార్టీకే ప్రమాదం: కేసీఆర్ - CM KCR
"రాష్ట్రానికి ఏదో ప్రమాదం వస్తోందని కాంగ్రెస్ నేతలు ప్రజలను భయపెడుతున్నారు. కానీ తెలంగాణకు ఎలాంటి ప్రమాదం లేదు... అది వాళ్ల పార్టీకే వస్తుంది" - కేసీఆర్, ముఖ్యమంత్రి
కాంగ్రెస్ పార్టీకే ప్రమాదం వస్తోంది: కేసీఆర్, సీఎం