గత కాంగ్రెస్ పాలనకంటే తెరాస ప్రభుత్వం ఎంతో మేలని ప్రజలు చెబుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికపై భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్యలు తప్పని చెప్పారు. తాము ప్రజలను నమ్ముకున్నామని అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస భారీ మెజార్టీతో గెలిచిందన్నారు. సాహసం, త్యాగలమీదే గులాబీ పార్టీ పుట్టిందని... రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని సీఎం కేసీఆర్ వివరించారు. అప్పులను లెక్కలతో సహా వివరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతికి అవసరమైతే... ఇంకా అప్పులు తెస్తామని స్పష్టం చేశారు.
అవసరమైతే ఇంకా అప్పులు తెస్తాం: సీఎం కేసీఆర్ - అప్పులు
రాష్ట్ర ప్రగతికి అవసరమైతే... ఇంకా ఇప్పులు తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెచ్చిన అప్పులు దేనిమీద వ్యయం చేస్తున్నామో ప్రతిపక్షాలు గమనించాలని సూచించారు.
అవసరమైతే ఇంకా అప్పులు తెస్తాం: కేసీఆర్, సీఎం