తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో తప్ప మరెక్కడా కరోనా యాక్టివ్ కేసులు లేవు: కేసీఆర్ - cm kcr review latest news

ఇకనుంచి కరోనాతో జీవించే వ్యూహం అనుసరించక తప్పదని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్, ఆర్టీఏ కార్యాలయాలు నడుస్తాయని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే హైదరాబాద్​లోని 4 జోన్లలో తప్ప ఎక్కడా కరోనా యాక్టివ్​ కేసులు లేనందున.. ప్రస్తుతం అమలవుతున్న లాక్​డౌన్​ నిబంధనలు యథావిధిగా అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్​ వెల్లడించారు.

'హైదరాబాద్​లో తప్ప మరెక్కడా కరోనా కేసులు లేవు'
'హైదరాబాద్​లో తప్ప మరెక్కడా కరోనా కేసులు లేవు'

By

Published : May 15, 2020, 9:23 PM IST

Updated : May 15, 2020, 11:59 PM IST

హైదరాబాద్​లోని 4 జోన్లలో తప్ప ఎక్కడా కరోనా యాక్టివ్​ కేసులు లేనందున.. ప్రస్తుతం అమలవుతున్న లాక్​డౌన్​ నిబంధనలు యథావిధిగా అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్​ వెల్లడించారు. తెలంగాణలో వైరస్ వ్యాప్తి, నియంత్రణా చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా ఇతర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్‌ తీవ్రతపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు.

లాక్‌డౌన్‌పై కేంద్రం మార్గదర్శకాలను పరిశీలించి రాష్ట్రంలో వ్యూహం ఖరారు చేస్తామని కేసీఆర్​ తెలిపారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటు.. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ఏసీల విక్రయ దుకాణాలు, ఆటోమొబైల్‌ షోరూంలు సహా ఆటో మొబైల్‌ స్పేర్‌పార్ట్స్‌ దుకాణాలను తెరిచేందుకు అనుమతినిస్తుట్లు ప్రకటించారు.

"కరోనా వైరస్ హైదరాబాద్‌లోని 4 జోన్లకే పరిమితమైంది.ఎల్బీనగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివ్ కేసులున్న కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలు కఠినం చేస్తున్నాం. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి శాతం కేవలం 2.38 మాత్రమే. ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువ. కరోనాతో కలిసి జీవించే వ్యూహం అనుసరించక తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్, ఆర్టీఏ కార్యాలయాలు నడుస్తాయి. వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విమానాల ద్వారా వచ్చేవారికి పరీక్షలు నిర్వహించాలి. విమానాశ్రయంలో దిగే వారిని ప్రత్యేక బస్సుల ద్వారా వారి సొంత రాష్ట్రాలకు పంపించాలి. జూన్ మాసానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించాం. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలకు మంచి స్పందన వచ్చింది.

-సీఎం కేసీఆర్​

సీఎం కేసీఆర్​ చేసిన సూచనలు:

  • పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి.
  • నెలకు 5 సార్లు సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయాలి.
  • చెత్తా చెదారం తొలగించడంతోపాటు దోమలు రాకుండా ఫాగింగ్ చేయాలి.
  • గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
  • ఈ విషయంలో ప్రజాప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించాలి.

ఇదీ చదవండి:కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!

Last Updated : May 15, 2020, 11:59 PM IST

ABOUT THE AUTHOR

...view details