తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Rakha Bandhan Wishes 2023 : తెలంగాణ మహిళలు దేశానికే దిక్సూచిగా నిలిచారు: సీఎం కేసీఆర్

CM KCR Rakha Bandhan Wishes 2023 : రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనురాగ బంధానికి ప్రతీక ఈ పండుగని అన్నారు. మానవ సంబంధాల్లో పరమార్థాన్ని ఇది తెలియజేస్తుందని చెప్పారు. రాఖీని రక్షాబంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని కేసీఆర్ పేర్కొన్నారు.

Rakhi Festival 2023
cm kcr

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 10:27 PM IST

Updated : Aug 31, 2023, 6:37 AM IST

CM KCR Rakha Bandhan Wishes 2023 : కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని.. మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భారతీయ సంస్కృతి, జీవనతాత్వికతకు ఇది వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. తోడబుట్టిన అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీపౌర్ణమి సందర్భంగా.. ప్రజలందరికీ కేసీఆర్ శుభాకాంక్షలు (CM KCR Rakhi Festival Wishes) తెలిపారు.

Raksha Bandhan Wishes and Quotes in Telugu: మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

రాఖీని రక్షాబంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని కేసీఆర్ తెలిపారు. అన్నాదమ్ముళ్లకురాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలవాలని.. అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారని తెలిపారు. మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా.. తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. మానవీయ పాలనే లక్ష్యంగా అమలు చేస్తున్న పలు పథకాలు.. వృద్దులు తదితర రక్షణ అవసరమైన వర్గాలకు భరోసా అందిస్తున్నాయని కేసీఆర్ వివరించారు.

సంపదను సృష్టించి సకలజనులకు పంచుతూ కొనసాగుతున్న ప్రగతి ప్రస్థానం.. రాష్ట్ర ప్రజల నడుమ సుహృద్భావ వాతావరణం, సహోదర భావాన్ని పెంచుతున్నదని కేసీఆర్ తెలిపారు. అనేక పథకాలను అమలు చేస్తూ.. మహిళలకు ప్రభుత్వం భరోసా అందిస్తూ, పెద్దన్నలా రక్షణగా నిలిచిందని అన్నారు. ఫలితంగా నేడు తెలంగాణలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ.. విజయ ప్రస్థానాన్ని సాగిస్తూ, దేశానికే దిక్సూచిగా నిలిచారని పేర్కొన్నారు. రాఖీ పండుగను (Rakhi Festival 2023) ప్రజలంతా ప్రేమానురాగాలు, ఆనందోత్సహాలతో జరుపుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

Commuter Rush During Rakhi Festival : మరోవైపు రక్షాబంధన్ పండుగ సందర్బంగా నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని ప్రధాన బస్​స్టేషన్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్.. ఉప్పల్, ఎల్బీనగర్​ ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ భారీగా (Commuter Rush During Rakhi Festival ) పెరిగిపోయింది. మరోపక్క సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో సందడిగా మారిపోయాయి. రాఖీ పండుగ సందర్బంగా ఆర్టీసీ ఈ నెల 29, 30, 31 తేదీల్లో 3,000ల ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది.

TSRTC Good News To Women On Rakhi Pournami : రాఖీ పౌర్ణమికి మహిళలకు ప్రత్యేక ఆఫర్​.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే బహుమతులు

ఈ మూడు రోజుల్లో ప్రతి రోజూ వెయ్యి బస్సులను నడిపిస్తుంది. వీటితో పాటు ఈ నెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలకు లక్కీ డ్రా ఏర్పాటు చేసి రూ.5.50 లక్షల విలువ గల బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది. ప్రయాణికులు తాము ప్రయాణించిన టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి బస్టాండ్​లో ఉన్న బాక్సులో వేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని తెలిపింది. మరోవైపు బస్సుల సంఖ్య పెంచినప్పటికీ.. తమకు సరిపడా బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు వాపోతున్నారు. ఒక్కో బస్సు కోసం సుమారు గంట నుంచి రెండు గంటల వరకు వేచి చూడాల్సి వస్తుందని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Jagtial Old Woman Viral Video : రాఖీ కట్టేందుకు కాలినడకన తమ్ముడి ఇంటికి 80 ఏళ్ల అవ్వ.. వీడియో వైరల్

Rakhi Purnima 2023 Special Story : రారండోయ్​.. రాఖీ పండుగ గురించి తెలుసుకుందాం..

Last Updated : Aug 31, 2023, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details