తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై భారత్ ఏకైక ఆయుధం 'లాక్​డౌన్' - కరోనాపై కేసీఆర్ ప్రెస్ మీట్

'కరోనాను నియంత్రించడానికి మనచేతిలో ఉన్న ఏకైక ఆయుధం గుంపులుగా గుమిగూడకపోవడమే. స్వీయ నియంత్రణ, లాక్​డౌన్​ను కచ్చితంగా పాటించడం. వైద్య, పోలీసు అధికారులకు సహకరించడం. ఈ ఆయుధంతో కరోనాను మనం జయించవచ్చు' - సీఎం కేసీఆర్

భారత్​లో ఏకైక ఆయుధం లాక్​డౌన్
భారత్​లో ఏకైక ఆయుధం లాక్​డౌన్

By

Published : Mar 29, 2020, 10:44 PM IST

కరోనా వైరస్​కు భారత్‌లో ఉన్న ఏకైక ఆయుధం లాక్‌డౌన్‌ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ కరోనా వ్యాప్తి నివారణలో తెలివిగా వ్యవహరించిందని అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు వచ్చాయని సీఎం తెలిపారు. ఇప్పటివరకు అందరూ సహకరిస్తున్నారు, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు. గండం గట్టెక్కిందని ఇప్పుడే సంబరపడవద్దని, ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదని హెచ్చరించారు.

సౌత్ కొరియాలో ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి నుంచి 59 వేల మందికి సోకిన ఉదంతాన్ని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పటి మాదిరిగానే అందరూ సహకరిస్తే తక్కువ నష్టంతో బయటపడతామని స్పష్టం చేశారు. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఉన్నంతకాలం స్వీయనిర్బంధంలో ఉండాలని మరోసారి ఉద్ఘాటించారు.

భారత్​లో ఏకైక ఆయుధం లాక్​డౌన్

ఇదీ చూడండి:-పీఎం కేర్స్​కు విరాళాల వెల్లువ- రైల్వే రూ.151కోట్లు

ABOUT THE AUTHOR

...view details