రాష్ట్రంలో తమ సంక్షేమ పథకాలు తాకని గడప లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ జరిగిన మంత్రి వర్గ సమావేశంలో 49 అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలతో... రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామన్నారు. సర్కారు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. గతంలో తీసుకున్న చర్యల వల్ల ఆర్థిక మాంద్యం ప్రభావం తక్కువగా ఉందన్నారు. రవాణారంగంలోనే కాస్త ప్రతికూల వృద్ధి రేటు ఉందని వివరించారు. నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీ వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.900 కోట్లు ఆదాయం వచ్చినట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో మేం తాకని గడప లేదు: సీఎం కేసీఆర్ - CM KCR SPEECH
తెరాస ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిచ్చాయన్నారు సీఎం కేసీఆర్. సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశంలో 49 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సంక్షేమ పథాకాలతో రాష్ట్రంలోని ప్రతీ గడపను తాకినట్లు తెలిపారు.
CM KCR ON TSRTC STRIKE AFTER CABINET MEETING