CM KCR Review on Podu Lands: పోడు భూములపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష - CM KCR high level review
16:48 October 09
పోడు భూములపై అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష
రాష్ట్రంలోని పోడు భూములపై అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష (CM KCR Review on Podu Lands) నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేసీఆర్ పోడు భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల విషయంలో గిరిజనులపై దాడులు చేయొద్దని అధికారులకు చెప్పామన్నారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో అవసరమైతే ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేద్దామని ప్రకటించారు. ‘పోడు సాగుపై ఆధారపడ్డ గిరిజనులకు అన్యాయం చేయడం సరికాదన్నారు. అటవీప్రాంతంగా గుర్తించిన భూమిపై యాజమాన్య హక్కులు ఉండవని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అసెంబ్లీలో చెప్పారు.
ఇదీ చూడండి: CM KCR: అఖిలపక్షంగా దిల్లీ వెళ్దాం.. 'పోడు'పై ప్రధానిని కలుద్దాం...