రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ CM KCR Diwali wishes 2023 : దీపావళి అనగానే ముందుగా గుర్తొచ్చేవి.. కాంతిని వెదజల్లే దీపాలు.. ఊరూ వాడా, పల్లె పట్నం అనే తేడా లేకుండా.. ప్రతి ఇళ్లు దీపాల వెలుగులతో విరాజిల్లుతోంది. రాత్రివేళ చీకటిని చీల్చుతూ మిరుమిట్లు గొలిపే టపాకాయలు.. నోటిని తీపిచేసే తీపి పదార్థాలు.. ఇవన్నీ పండగ సందడిని రెట్టింపు చేస్తాయి. పండక్కి అవసరమైన ప్రమిదలు, టపాకాయల కొనుగోలులో జనం బిజీ అయ్యారు. మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. వివిధ దుకాణాలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించటంతో రద్దీగా మారాయి.
దీపావళి వెలుగుల్లో వాస్తు - ఏ దిశలో ఏ రంగు దీపాలు వెలిగించాలో మీకు తెలుసా?
CM KCR Extends Diwali Greetings :దీపావళి పండుగ పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా.. చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా.. హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యం ఉందని అన్నారు. జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారం తొలగించడం ద్వారా చైతన్యం రగిలించి కొత్త ఉత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని కేసీఆర్ స్పష్టంచేశారు.
దీపావళి వేళ హైదరాబాద్ విద్యుత్ దీపాల వెలుగుల్లో వెలిగిపోతోంది. వివిధ దుకాణ సముదాయాలు.. దీపాల వెలుగులో కాంతులీనుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌లలో వాణిజ్య సమూదాయాలు, బహుళ అంతస్థుల భవనాలు రంగు రంగుల దీపాలతో అందంగా అలకరించారు.
దీపావళి స్వీట్స్ - పండగను మరింత తియ్యగా జరుపుకోండి!
Diwali Festival Rush at Markets In Telangana : వెలుగుల పండగ అయిన దీపావళి ధన త్రయోదశితో ప్రారంభం అవుతుంది. ధన త్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థం. దీపావళికి ముందురోజు లక్ష్మీదేవి, కుబేరుడిని పూజించడం ఆనవాయితీ. ఇందుకోసం ప్రత్యేకంగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. నగల దుకాణాలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో ఎవరి స్థోమతకు తగినట్లు వారు కొనుగోలు చేశారు. అయితే ఎన్నికల సమయం కావడంతో చాలా మంది కొనుగోలుకు భయపడుతున్నారని నిర్వాహకులు అంటున్నారు.
Diwali Festival 2023 :రకరకాల మిఠాయిలు దుకాణాల్లో కనువిందు చేస్తున్నాయి. విభిన్న రకాల ప్రమిదలకు గిరాకీ పెరిగింది. ప్రమిదలతోపాటు ప్రత్యేకంగా తయారు చేసిన వివిధ రకాల వస్తువులకు ప్రజల నుంచి ఆదరణ బాగుందని అమ్మకందారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెరిగింది. కొందరు సాధారణంగా అమ్మే టపాకాయలు కాకుండా.. పర్యావరణహిత క్రాకర్స్ కొంటున్నారు. వాటి ధర కాస్త ఎక్కువైనా గాలి కాలుష్యం కాకుండా ఉంటుందనే ఉద్దేశ్యంతో పలువురు వాటిని కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలుదారులతో టపాసుల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. వారాంతం కావడం, విద్యా సంస్థలకు సెలవులతో టోల్ ప్లాజాల్లో రద్దీ నెలకొంది.
అక్షర్ధామ్ ఆలయంలో దీపావళి వేడుకలు- 'గ్లో గార్డెన్ థీమ్'తో 10వేల దీపాలంకరణ!
దీపావళి బోనస్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్- ఉద్యోగులకు యజమాని సర్ప్రైజ్