తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రం ప్యాకేజీ డొల్ల... ముఖ్యమంత్రి గుస్సా

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఒట్టి డొల్ల, బోగస్ అని కేసీఆర్​ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్యాకేజీ అంకెల గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయని వివరించారు. కేంద్రం వైఖరి నియంతృత్వంగా ఉందని ఆరోపించారు. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తారా? అని సీఎం ప్రశ్నించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ దరిద్రపు ఆంక్షలు పెట్టారని విమర్శించారు.

కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా..?: కేసీఆర్​
కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా..?: కేసీఆర్​

By

Published : May 18, 2020, 9:24 PM IST

Updated : May 19, 2020, 8:01 AM IST

"కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా ఎవరన్నా? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కేంద్ర సంస్కరణలు అమలు చేస్తే రుణం ఇస్తామనడం ప్యాకేజీ అవుతుందా? ఒకే దేశం - ఒకే రేషన్ అనే షరతు పెట్టారు. కేంద్ర ప్యాకేజీ పచ్చి.. దగా, మోసం, గ్యాస్. రాబోయే రోజుల్లో కేంద్రం తీరు జనాలకు తెలియకుండా ఉండదు. కేంద్రం వ్యవహరించిన తీరు చాలా తప్పు. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఫలానావి చేస్తేనే డబ్బులిస్తాం అనడం ఏం ప్యాకేజీ? సంస్కరణలు అమలు చేస్తేనే అని రాష్ట్రాలపై షరతులు రుద్దటం సరికాదు. కేంద్రం చెప్పిన పరిమితుల్లో అనేకంలో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. అవసరమైతే ముష్టి రూ.2,500 కోట్లు తీసుకోం. రాష్ట్రాలకు భిక్షం వేస్తున్నారా? మావి కూడా రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలే కదా? శిశుపాలుడికి కూడా వంద తప్పుల వరకు సహించారు."

-కేసీఆర్​, సీఎం

కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా..?: కేసీఆర్​

ఇదీ చూడండి :'బైంసా బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తా'

Last Updated : May 19, 2020, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details