భవిష్యత్‌లోనూ తెరాస(Trs)నే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr On Trs Party)అసెంబ్లీ వేదిక(Telangana Assembly)గా చెప్పారు. కొంతమంది కలలు కంటున్నారని వారి కలలు ఎప్పటికీ నెరవేరవని తేల్చిచెప్పారు. తమది రాజకీయ పార్టీయేనని... మఠం కాదని స్పష్టం చేశారు. తమకు అన్ని రకాల అంచనాలు, సర్వేలు ఉన్నాయని దాని విధంగా నడుచుకుంటామని చెప్పిన కేసీఆర్... తర్వాత ఏర్పడేది కూడా తెరాస ప్రభుత్వమేనని అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు.
రఘునందన్ రావుకి చాలా పెద్ద సందేహం వచ్చింది. ఒక్క హుజూరాబాద్‌కే విడుదల చేసిండ్రా.. వీటికి కూడా విడుదల చేసిండ్రా అని చెప్పి... ఇది ప్రభుత్వం రఘునందన్ రావు. మాకు చాలా బాధ్యత ఉంది. ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్లం. ముందర కూడా మేమే ఉంటాం. మీరు ఉండేదేందో సచ్చేదేందో. మాకు అన్ని అంచనాలు ఉన్నయి. కొంతమందికి ఏదో ఈస్ట్‌మన్ కలర్ డ్రీమ్స్ ఉండొచ్చు. కానీ మాది రాజకీయ పార్టీయే కదా మాదేమన్న మఠమా? మాకు తెల్వదా మాకు అంచనాలు, సర్వేలు ఉండవా? భవిష్యత్‌లో కూడా మా ప్రభుత్వమే కొనసాగుతుంది అందులో అనుమానం ఎందుకు? ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు ఎందుకు పక్కన పెడతరు? ఏం కారణం చేత పక్కన పెడతరు. నేను అందుకే చెప్పిన మాకు ఆత్మ విశ్వాసం ఉందని. ఈ నాలుగు మండలాలకు రూ. 1,500 కోట్లు ఖర్చు అవుతాయి. మొదట్లో పెట్టుకున్న రూ. 1,000 కోట్లు కూడా ఖర్చు అవుతాయి. అంటే సుమారు 3వేల కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమం మార్చిలోపల అమలవుతుంది.