ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం 3 లక్షల మొక్కలు నాటుతామని ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. హయత్‌నగర్ బాలికల గురుకులంలో మొక్కలు నాటి.... విద్యార్థినులకు నూతన దుస్తులు అందిస్తామని మంత్రి తెలిపారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయంలో మొక్కల పంపిణీ చేపట్టారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, విమానాశ్రయం సీఈవో ప్రదీప్ పానేకర్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంతోష్ పిలుపునిచ్చారు.
బల్కంపేట అమ్మవారికి బంగారుచీర
ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ... హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో అత్యంత వైభవంగా జరుపుతామని తలసాని వెల్లడించారు. రెండున్నర కిలోలతో తయారు చేయించిన బంగారు చీరను ఎమ్మెల్సీ కవిత బల్కంపేట అమ్మవారికి సమర్పిస్తారని మంత్రి తెలిపారు. 300మంది మహిళలకు చీరలు అందజేస్తామని తెలిపారు. మసీదు, చర్చిలు, మందిరాలు, గురుద్వారాలలో ప్రత్యేక కార్యక్రమాలుంటాయన్నారు. త్రీడీలో కేసీఆర్ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ విడుదల చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
ముందస్తుగానే వేడుకలు
పలుచోట్ల ముందస్తుగానే జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని హోంమంత్రి ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌కుమార్ స్వగ్రామమైన కొదురుపాకలో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు తెరాస శ్రేణులు ఏర్పాట్లు చేశారు. నాగార్జునసాగర్ బుద్ధవనంలో తెలంగాణ ఉద్యమకారుడు బాలరాజు.. కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి.. మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని హోం మంత్రి పిలుపునిచ్చారు.
భారీ వేడుకలకు సన్నాహాలు