KCR Birthday In London : ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ జన్మదిన వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి నాయకత్వంలో వేడుకలు జరిగాయి. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి.. దాదాపు 200లకు పైగా ఎన్నారై తెరాస, ఇతర ప్రవాస కుటుంబసభ్యులు హాజరయ్యారు. 'దేశ్ కా నేతా మన కేసీఆర్... మేమంతా మీ వెంటే అంటూ ఎన్నారైలు నినదించారు.
KCR Birthday In London : లండన్‌లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు - యూకేలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
KCR Birthday In London : లండన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్... జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు... ఎన్నారై తెరాస యూకే ఆధ్వర్యంలో... వేడుకలు నిర్వహించారు.
CM KCR Birthday In London
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా ఆదర్శంగా ఉన్నాయని ఎన్నారై నేతలు పేర్కొన్నారు. భవిష్యత్తులో సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే ఉంటామని తెలిపారు.
ఇదీ చూడండి :KCR Birthday: కడియం నర్సరీలో కేసీఆర్కు వినూత్నంగా శుభాకాంక్షలు