ఆంధ్రప్రదేశ్‌లో తుపాను అనంతర పరిస్థితులపై ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష (cm jagan video conference on cyclone)నిర్వహించారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై చర్చించారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తుపాను అనంతర పరిస్థితులను వివరించారు. వర్షం తగ్గుముఖం పట్టగానే విద్యుత్ పునరుద్ధరించాలని సీఎం జగన్ (AP CM Jagan) ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు కూడా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎస్‌కు సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.
వెనకడుగు వేయొద్దు..
అలాగే బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న జగన్ (AP CM Jagan)... బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయవద్దని తెలిపారు. సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం, రక్షిత తాగునీరు అందించాలి సూచించారు. అవసరమైన అన్నిచోట్లా సహాయక శిబిరాలు తెరవాలని, విశాఖలోని ముంపు ప్రాంతాల్లో వర్షపు నీరు తొలగించాలన్నారు.