ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) అవసరాల దృష్ట్యా కొవిడ్ కేసులు అదుపులోకి వచ్చేవరకు జామ్‌నగర్ రిలయన్స్ ప్లాంట్ నుంచి రోజూ 80 టన్నుల ఆక్సిజన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు.
రాష్ట్రం ఆక్సిజన్ కొరత నుంచి బయటపడాలంటే రోజూ 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని జగన్ లేఖలో పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాలకు తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్ రవాణాలో ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించారు. ఈ నెల 10న చెన్నై, కర్ణాటక నుంచి రావలసిన ఆక్సిజన్ జాప్యంతో తిరుపతి ఆసుపత్రిలో 11 మంది రోగులు మృతి చెందారని సీఎం వివరించారు.