తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర పరిస్థితులపై సీఎల్పీ ఆన్​లైన్​ సమావేశం - రాష్ట్ర పరిస్థితులపై సీఎల్పీ ఆన్​లైన్​ సమావేశం

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై సీఎల్పీ ఆన్​లైన్​ సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ధాన్యం కొనుగోలు పరిస్థితులపై చర్చించారు.

CLP Online Meeting on State Conditions
రాష్ట్ర పరిస్థితులపై సీఎల్పీ ఆన్​లైన్​ సమావేశం

By

Published : Apr 28, 2020, 7:41 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాయాలని, డీజీపీ మహేందర్​రెడ్డిని కలవాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఆన్​లైన్​ద్వారా నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ధాన్యం కొనుగోలు పరిస్థితులపై చర్చించారు.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన బియ్యం అందరికీ సరఫరా చేయాలని కోరారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారిలో ఎంత మందికి రూ.1500 ఇచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య తక్కువ చూపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.

పార్టీ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేసేలా చూడాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: కూలీల సమస్యలకు పరిష్కారం చూపాలి: వీహెచ్

ABOUT THE AUTHOR

...view details