ప్రభుత్వ యంత్రాంగం నడవడానికి ఉద్యోగులెంతో అవసరమని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పేర్కొన్నారు. 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే.. అందరినీ తొలగిస్తామని చెప్పడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. న్యాయ, ఉద్యోగ వ్యవస్థలను గౌరవించే ఆలోచన సీఎంకు లేకపోవడం బాధాకరమని చెప్పారు.మెరుగైన పరిస్థితుల కోసం పోరాడుతున్న ఆర్టీసీ ఉద్యోగులను మరింత దారుణంగా మార్చారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి రాష్ట్రంలో కొరవడిందని అభిప్రాయపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో భావ వ్యక్తీకరణకు చోటులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులను మన బిడ్డలుగానే చూడాలని సూచించారు. వెంటనే సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
కేసీఆర్ తీరుతో ఆర్టీసీ మరింత నష్టపోతోంది: భట్టి
న్యాయ, ఉద్యోగ వ్యవస్థను గౌరవించే ఆలోచన ముఖ్యమంత్రికి రావడం లేదు. మెరుగైన పరిస్థితుల కోసం పోరాడుతున్న ఆర్టీసీ ఉద్యోగులను మరింత అధ్వానంగా మార్చారు--- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఉద్యోగవ్యవస్థను గౌరవించే ఆలోచన సీఎంకు లేదు: భట్టి